
నాచురల్ స్టార్ నాని సినిమా చేస్తే హిట్ అన్నట్టు ఉంది పరిస్థితి చూస్తుంటే.. రీసెంట్ గా మజ్నుతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్న నాని ప్రస్తుతం నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో నేను లోకల్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా మిగతా దర్శకుల కథలు వింటున్న నాని ఓ గురుశిష్యుల కథను ఓకే చేశాడట. గురు శిష్యులా అదేంటి అంటే.. నానికి ఓ సంవత్సరం పాటుగా టచ్ లో ఉంటూ కథా చర్చల్లో పాల్గొంటున్న శివ అనే కొత్త కుర్రాడికి ఎట్టకేలకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు. ఇక దీనితో పాటుగా పరశురాం కూడా నానితో ఓ సినిమాకు సిద్ధమయ్యాడట. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే పరశురాం దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన శివ నానిని ఇంప్రెస్ చేసి సినిమాకు సిద్ధమయ్యాడు. ఓ పక్క పరశురాం కూడా నానితో సినిమా చేస్తున్నాడు. సో ఒకేసారి నానితో గురు శిష్యులులతో చేస్తున్నాడన్నమాట. 
మరి ఇద్దరితో నాని ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. యువత, సోలో సినిమాలతో ఓ గుర్తింపు తెచ్చుకున్న పరశురాం రీసెంట్ గా అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు హిట్ తో తన ప్రతిభ చాటుకున్నాడు. అందుకే నానికి కథ చెప్పగానే ఓకే అనేశాడట. మరి వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న నాని ఆ సినిమా ఫలితాలను ఏవిధంగా అందుకుంటాడో చూడాలి.