'రౌడీ బోయ్స్' టీజర్..!

దిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా వస్తున్న ఆశిష్ తన మొదటి సినిమానే యూత్ ఫుల్, మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. రౌడీ బోయ్స్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను హర్ష కొనుగంటి డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తుంది. ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. 

లేటెస్ట్ గా రౌడీ బోయ్స్ టీజర్ రిలీజ్ చేశారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. పవర్ ఫుల్ టైటిల్ తో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైనర్ ఇలా యువత మెచ్చే అన్ని అంశాలతో రౌడీ బోయ్స్ వస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.