పార్ట్-3 కూడా ఉంటుంది..!

బాహుబలి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సౌత్ స్టార్ డైరక్టర్ గా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న రాజమౌళి ప్రస్తుతం పార్ట్-2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా పూర్తయ్యాక వేరే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్న రాజమౌళి బాహుబలికి పార్ట్-3 కూడా ఉంటుంది అంటూ గట్టిగా చెబుతున్నాడు. సినిమాలో హీరోల కన్నా మాహిష్మతి సామ్రాజ్యం ప్రేక్షకుల్లో ఏర్పరచిన అనుభూతి గొప్పది అందుకే ఇది మరో పార్ట్ కూడా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నాడు రాజమౌళి. 

అయితే బాహుబలి పార్ట్-3 లో మాత్రం ఈ నటీనటులు ఉండే అవకాశం లేదట. పార్ట్-2 కన్ క్లూజ్ చేసి కొత్త కథతో బాహుబలిని కొనసాగించాలని రాజమౌళి ప్లాన్. అందుకే బాహుబలి కోసం వేసిన సెట్స్.. గ్రాఫిక్ వర్క్ అలానే పదిలంగా ఉంచుతారట. మరి వాటిని సంవత్సరాల కొద్ది అలానే ఉంచడం కుదరదు కాబట్టి పార్ట్-2 ముగించాక వెంటనే బాహుబలి-3 స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.

ప్రస్తుతానికైతే పార్ట్-2 ముగింపు దాకే కథ కూడా రాసుకున్నారట రచయిత విజయేంద్ర ప్రసాద్. కాని ఆయన కూడా చాలా ఇంటర్వ్యూల్లో బాహుబలి కచ్చితంగా కొనసాగుతుందని అన్నారు. సో మరి తండ్రి కొడుకులు ఏ రేన్లో ప్లాన్ వేశారో తెలియదు కాని పార్ట్-3 లో నటించే నటీనటులు ఎవరా అని ఇప్పటి నండే డిస్కషన్స్ స్టార్ట్ చేశారు ఆడియెన్స్.