భీమ్లా నాయక్ నుండి డ్యానియల్ శేఖర్ వచ్చాడు..!

మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కు అఫీషియల్ రీమేక్ గా వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రం డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాలో పవన్, రానా కలిసి నటిస్తున్నారు. భీమ్లా నాయక్ టైటిల్ రోల్ పవన్ చేస్తుండగా సినిమాలో రానా డ్యానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు. రానాకి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

సినిమాలో రానా తన పాత్రలో అదరగొట్టేశాడని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2021 జనవరి 12న రిలీజ్ ఫిక్స్ చేశారు. భీమ్లా నాయక్ వర్సెస్ డ్యానియల్ శేఖర్ ల మధ్య జరిగే ఈగో ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.