బాహుబలి-2 ప్రెస్ మీట్ విశేషాలు..!

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి బాహుబలి-2 ను అదే రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. అయితే సడెన్ గా నిన్న రాజమౌళి అండ్ టీం ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబందించిన విషయాల పట్ల క్లారిటీ ఇచ్చాడు. సినిమా అనుకున్నట్టుగానే పూర్తవుతుంది అని చెప్పిన చిత్రయూనిట్ నవంబర్, డిసెంబర్ లో కొంతపార్ట్ షూట్ చేస్తామని.. ఇక జనవరిలో టీజర్, ట్రైలర్ రిలీజ్ ఉంటుందని తెలిపారు.

అయితే అక్టోబర్ మొత్తం బాహుబలి మేనియా కొనసాగనుంది.. అక్టోబర్ 1న అనగా ఈరోజు యానిమేటెడ్ సీరీస్ తో ఓ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్రయూనిట్ 22న కామిక్ సీరీస్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు పురస్కరించుకుని ఓరోజు ముందే అక్టోబర్ 22న బాహుబలి-2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. ఇక అదే కాకుండా అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు రాజమౌళి. ఇక సినిమాను కూడా అనుకున్నట్టుగానే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారమని చెప్పారు. 

సో మొత్తానికి సినిమా షూటింగ్ మిగతా విషయాల పట్ల ఆడియెన్స్ లో ఉత్సాహం నింపేందుకు బాహుబలి-2 ప్రెస్ మీట్ కొనసాగింది. అక్టోబర్ నెల మొత్తం బాహుబలి సందడితో ఫ్యాన్స్ లో హుశారుని కలిగించేందుకు సిద్ధమయ్యారు బాహుబలి టీం.. ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళితో పాటుగా ప్రభాస్, రానా బాహుబలి నిర్మాతలు పాల్గొన్నారు.