టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరీ, తరుణ్ లకు క్లీన్ చిట్..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరక్టర్ పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ క్లీన్ చిట్ ఇచ్చింది. వారిద్దరికి జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు లేవని వెల్లడించారు. 2017లో వీరిద్దరి నుండి సేకరించిన బ్లడ్, హెయిర్, నెయిల్ శాంపిక్స్ పై పరీక్షలు నిర్వహించిన ఎఫ్.ఎస్.ఎల్ కీలక నివేదిక ప్రకటించింది. దర్శకుడు పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని వారి నివేదికను ఎక్సైజ్ విభాగానికి అందించింద్ ఎఫ్.ఎస్.ఎల్.

ఈ నివేదిక పూరీ జగన్నాథ్, తరుణ్ లకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇంకా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రకుల్, ఛార్మి, ముమైత్ ఖాన్, రానా, తనీష్, నవదీప్, నందు లను ఈడీ విచారించారు.