
అ! సినిమాతో టాలెంట్ చూపించిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి సినిమాతో కూడా మెప్పించాడు. ఈమధ్య వచ్చిన జాంబి రెడ్డితో కూడా మరోసారి తన సత్తా చాటిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. జాంబిరెడ్డి ఫేమ్ తేజ సజ్జా లీడ్ రోల్ లో సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. హను మాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు ప్రశాంత్ వర్మ.
చేస్తున్న ప్రతి సినిమాతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ తప్పకుండా టాలీవుడ్ లో స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరిపోతాడని మాత్రం చెప్పొచ్చు. హను మాన్ టీజర్ తోనే అంచనాలు పెంచిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలో అంతకుమించి అనిపించేలా ఉన్నాడు.