టక్ జగదీష్ ప్రీమియర్స్ టైం మారింది..!

నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాకు థమన్, గోపీ సుందర్ ఇద్దరు మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 10న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్న టైం కు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తుంది. సినిమాను సెప్టెంబర్ 9న రాత్రి 7 గంటలకే అమేజాన్ ప్రైం లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.

నాని సినిమాను నాలుగు గంటల ముందే చూసేయడం ఫ్యాన్స్ ను ఎక్సయిటింగ్ కు గురి చేస్తుంది. టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ నానికి అంతగా ఇష్టం లేకపోయినా సరే నిర్మాతల ఆర్ధిక ఇబ్బందుల వల్ల నాని అందుకు ఒప్పుకోక తప్పలేదు. లాస్ట్ ఇయర్ నాని నటించిన వి సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.