సినిమా టికెట్ల కోసం ప్రభుత్వ వెబ్ సైట్.. ఏపీ ప్రభుత్వం జీవో రిలీజ్..!

ఏపీ లో సినిమా టికెట్ల రేటుపై సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేలా అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ లను ప్రభుత్వమే ప్రత్యేక పోర్టల్ ద్వారా అమ్మేలా ప్లాన్ చేశారు. సినిమా టికెట్ల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది. రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టం తరహాలోనే సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన జీవో రిలీజ్ చేశారు.  

ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో ఈ ఆన్ లైన్ టికెట్ల అమ్మకం జరుగుతుందని ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ సింగిల్ థియేటర్స్, మల్టీ ప్లెక్స్ లలో కూడా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా టికెట్లు పొందే అవకాశం ఉంది. బి, సీ సెంటర్ల లో కూడా అక్కడ ఆన్ లైన్ చేశారు. ఇదే సిస్టెం ను ఏపీలో ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం స్వయంగా ఓ పోర్టల్ ను అభివృద్ధి చేస్తుందని ప్రకటించారు.