
నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. సినిమాను ఈ ఇయర్ ఏప్రిల్ లో ఉగాది కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నా అది కుదరలేదు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరచుకున్నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే సెప్టెంబర్ 10న నాగ చైతన్య లవ్ స్టోరీ రిలీజ్ అని ప్రకటించారు. కాని ఆ డేట్ ను కూడా లవ్ స్టోరీ మిస్ చేసుకుంటుంది. ఏపీలో ఇంకా అన్ని చోట్ల థియేటర్లు తెచుకోకపోవడంతో పాటుగా ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వచ్చి సినిమా చూడటానికి సుముకంగా లేరన్న కారణంతో లవ్ స్టోరీ వాయిదా వేశారు. అయితే సెప్టెంబర్ 10న మిస్సైన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24 లేదా 30న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ రెండు డేట్స్ లో నాగ చైతన్య లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందని అంటున్నారు. సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా సినిమాపై కూడా ఆడియెన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.