RC 15 లాంచ్..!

శంకర్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ రాజమౌళి, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. చిరు క్లాప్ కొట్టి ముహుర్త సన్నివేశం షూట్ చేశారు. 

ఇండియన్ 2 సినిమా అర్ధాంతరంగా ఆగిపోగా చరణ్ సినిమా విషయం లో కూడా స్టార్ట్ అవ్వకముందే శంకర్ పై కోర్ట్ లో ఫిర్యాదు చేశారు. అయితే వాటన్నిటినీ సాల్వ్ చేసుకుని చరణ్ సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నారు. సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో సునీల్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడని టాక్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.