
సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేస్తాడని తెలిసిందే. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ అల్లు ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా డిసెంబర్ నుండి ఐకాన్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తారని చెబుతున్నారు. పుష్ప పార్ట్ 1 డిసెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు. క్రిస్ మస్ రేసులో పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది.
డిసెంబర్ లోనే అల్లు అర్జున్ ఐకాన్ కూడా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో పూజా హెగ్దే, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. ఐకాన్ ట్యాగ్ లైన్ కనబడుట లేదు. సినిమాలో అల్లు అర్జున్ బ్లైండ్ రోల్ లో కనిపిస్తాడని టాక్. మొత్తానికి పుష్ప తర్వాత మరో ఛాలెంజింగ్ రోల్ లో అల్లు అర్జున్ అదరగొట్టాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు.