మెగాస్టార్ రిలీజ్ చేసిన క్లాప్ టీజర్..!

ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా క్లాప్. పృద్వి ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆది పినిశెట్టికి జోడీగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించింది. క్లాప్ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆది సినిమా టీజర్ రిలీజ్ చేయడంపై తన ఆనదాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. బహుబాషా నటుడైన ఆదిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తామని.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఏవీ నిరాశపరచలేదని.. ఆది నటించిన ఈ స్పోర్ట్స్ సినిమా కూడా అందరిని ఆకట్టుకుందని అన్నారు చిరు. 

కలలు నెరవేర్చుకునే క్రమంలో ఎవరి మద్ధతు లేని ఒక యువ స్ప్రింటర్ యువతకి ఎలా స్పూర్తిగా నిలుస్తాడనే కథతో ఈ సినిమా వస్తుంది. ఇళయరాజా అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ట్రైలర్ తో పాటు త్వరలోనే సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తామని. క్లాప్ రిలీజ్ త్వరలో ఎనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పారు.