ఆ సింగర్ కు ఛాన్స్ ఇచ్చిన రౌడీ హీరో..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాను ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో సత్తా చాటి ఫైనల్స్ వరకు వెళ్లిన తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియకు తన సినిమాలో ఒక సాంగ్ పాడే అవకాశం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇండియన్ ఐడల్ 12వ సీజన్ లో ఫైనల్స్ వరకు వెళ్లింది షణ్ముఖ ప్రియ. ఈ క్రమంలో ఫైనల్స్ కు చేరిన ఆమెకు విజయ్ దేవరకొండ బెస్ట్ విసెష్ అందించాడు. అంతేకాదు హైదరాబాద్ వచ్చాక తనని కలవాలని అన్నారు. తనకు లైగర్ లో పాడే అవకాశం ఇప్పిస్తానని అన్నారు. చెప్పినట్టుగానే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో షణ్ముఖ ప్రియ ఒక సాంగ్ పాడింది.

విజయ్ దేవరకొండ, షణ్ముఖ ప్రియ మీటింగ్ కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్కమింగ్ సింగర్ కు ఛాన్స్ ఇచ్చి లేడీ ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.  పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న లైగర్ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.