
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తర్వాత ఐకాన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. వేణు శ్రీరాం డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుందిల్. ఆల్రెడీ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో సినిమాల్లో కలిసి నటించిన పూజా హెగ్దే హ్యాట్రిక్ సినిమాగా ఐకాన్ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. ఇక సినిమా కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా అవసరం ఉంటుందని తెలుస్తుంది.
ఐకాన్ లో సెకండ్ హీరోయిన్ గా ఉప్పెన భామ కృతి శెట్టికి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. ఉప్పెన సినిమాతో ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి వరుసగా నాలుగైదు ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఐకాన్ లో కూడా కృతి శెట్టి అవకాశం వచ్చిందని అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో కృతి శెట్టి లక్కీ ఛాన్స్ అందుకుంది. అమ్మడి దూకుడు చూస్తుంటే టాలీవుడ్ లో లాంగ్ కెరియర్ ఉండేలా అనిపిస్తుంది.