
సైరా లాంటి సినిమా తీశాక స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తాడని అనుకున్న డైరక్టర్ సురేందర్ రెడ్డి స్టార్స్ ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో యువ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫిక్స్ చేసుకున్నాడు. అయితే పవన్ సినిమా కన్నా ముందు మరో యువ హీరో నితిన్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.
నితిన్ తో సురేందర్ రెడ్డి కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ కాంబో ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. ఏజెంట్ పూర్తి కాగానే నితిన్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. సైరా తర్వాత కొద్దిగా టైం పట్టినా వరుస క్రేజీ సినిమాలతో సురేందర్ రెడ్డి సత్తా చాటడానికి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు.