ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా జీవిత, హేమ..!

ఈసారి మా అధ్యక్ష పదవి పోటీ రసవత్తరంగా ఉంటుందని తెలుస్తుంది. ఈసారి మా ఎలక్షన్స్ లో ఐదుగురు దాకా పోటీలో నిలుస్తారని వార్తలు వచ్చాయి. ఆమధ్య మీడియా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఓ ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేశారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ ముంద్దు మా అధ్యక్ష బరిలో నిలుస్తుండగా ఆ తర్వాత తెలంగాణ నుండి జి.వి.ఎల్ నరసిం హా రావు, కాదంబరి కిరణ్ కూడా మా ఎలక్షన్స్ బరిలో నిలుస్తున్నారని వెల్లడించారు.

అయితే అనూహ్య పరిణాల మధ్య హేమ, జీవిత రాజశేఖర్ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో చేరారు. ప్రకాశ్ రాజ్ కు సపోర్ట్ గా అతని ప్యానెల్ లో ఉపాధ్యక్షిడిగా హేమ.. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ప్లానింగ్ నచ్చడంతో హేమ, జీవిత రాజశేఖర్ కూడా ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. జివిఎల్ నరసింహా రావు తెలంగాణా సెంటిమెంట్ అని చెప్పి అ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక కాదంబరి కిరణ్ కూడా సైలెంట్ గా ఉన్నారు. చెప్పాలంటే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల ల మధ్యే ఈ పోటీ ఉంటుందని చెప్పొచ్చు. మా బిల్డింగ్ ఒక్కటే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సమస్య కాదని.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు ప్రకాశ్ రాజ్. ఇక నరేష్ ఇస్తున్న నైట్ పార్టీల గురించి చెబుతూ రోజంతా షూట్ చేసి వచ్చి నైట్ పార్టీ చేసుకోవడంలో తప్పేమి లేదని అన్నారు.