
మంచు హీరో మనోజ్ ఈ మధ్య తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయకపోవడంతో రేసులో పూర్తిగా వెనుకపడ్డాడు. కుర్ర హీరోలేమో వరుసెంట హిట్లతో హుశారెత్తిస్తుంటే మనోజ్ మాత్రం హిట్ కు ఆమడ దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 'ఒక్కడు మిగిలాడు' సినిమా చేస్తున్న మనోజ్ దానితో పాటుగా సత్య డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమాకు టైటిల్ గా 'గుంటూరోడు' అని పెట్టబోతున్నారట. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
కథ కథనాలన్ని మనోజ్ ను కొత్తగా ప్రెజెంట్ చేసేలా ఈ సినిమా తీర్చిదిద్దుతున్నారట. ముఖ్యంగా సినిమా మొత్తం గుంటూర్ నేపథ్యంతో సాగుతుంది కాబట్టి టైటిల్ కూడా గుంటూరోడు అని ఫిక్స్ చేశారట. అయితే ఈ టైటిల్ కు సంబందించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శౌర్య ఫ్లాప్ తర్వాత మనోజ్ చేస్తున్న ఈ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టాడు. కెరియర్ పెద్ద సంక్షోభంలో ఉన్న ఈ టైంలో మాస్ ఎంటర్టైనర్ కథలతోనే ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయాలని అలాంటి సినిమాలకే ఓకే చెబుతున్నాడు. ఈ మధ్య కాస్త లావెక్కిన మనోజ్ తన బాడీ షేప్ ను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడట.