
స్టార్ హీరోలు కథా బలమున్న సినిమాలను చేస్తే అవి ఏ రేంజ్ హిట్లు కొడతాయో తాను తీసిన మూడు సినిమాలతో అందరికి తెలిసేలా చేశాడు దర్శక రచయిత కొరటాల శివ. రీసెంట్ గా వచ్చిన జనతా గ్యారేజ్ తో తారక్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచేలా చేసిన శివ ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ తీస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే.. అబ్బో రికార్డులు బద్ధలే అంటున్నారు.
శ్రీమంతుడులో ఊరిని దత్తత తీసుకోవడం.. జనతా గ్యారేజ్ మొక్కలను ప్రేమించడం ఇలా సమాజానికి ఉపయోగపడే సందేశంతో వస్తున్న కొరటాల శివ సినిమాలు పవన్ తో సామాజిక అంశంతో ఓ అద్భుత కథ సిద్ధం చేస్తే బాగుంటుంది. ఇక ఈ కాంబినేషన్ కలపడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. తన దగ్గర పది బ్లాక్ బస్టర్ కథలు ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాయంటూ చాలెంజ్ చేసిన కొరటాల శివ పవన్ కోసం కూడా ఓ కథను సిద్ధం చేసుకుని ఉండొచ్చు.
మరి పవన్ కొరటాల కాంబినేషన్ కలిస్తే కచ్చితంగా ఓ మంచి సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కలయిక ఎప్పుడు జరుగుతుందో వేచి చూద్దాం. ప్రస్తుతం కొరటాల శివ శ్రీమంతుడు మహేష్ తోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ కథ కూడా కొత్తగా ఉండబోతుందని టాక్.