అనుజతో అవినాష్..!

జబర్దస్త్ షోతో పాపులరై.. బిగ్ బాస్ సీజన్ 4లో స్టార్ ఎంటర్టైనర్ గా నిలిచిన ముక్కు అవినాష్ ఫైనల్ గా పెళ్లికి సిద్ధమయ్యాడు. బుల్లితెర మీద హంగామా చేసే వారిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో అవినాష్ ఒకడు. అతని పెళ్లి మీద కొన్ని కామెడీ స్కిట్స్ కూడా వచ్చాయి. వాటికన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేలా అవినాష్ కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అనుజతో అవినాష్ ఎంగేజ్మెంట్ పూర్తయింది. 

తన చిన్ననాటి స్నేహితురాలుతోనే అవినాష్ పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడం.. దానికి ఇరువురి పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. త్వరలోనే అనుజతో నా పెళ్లి జరుగనుంది. ఎప్పటిలానే తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నా అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అవినాష్ మెసేజ్ పెట్టాడు.