
ట్రిపుల్ ఆర్, ఆచార్య రెండు క్రేజీ సినిమాల తర్వాత ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా తన 15వ సినిమా సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ తో ఫిక్స్ చేసుకున్నారు రాం చరణ్. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ డైరక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా ఆర్సీ 15వ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ 16వ సినిమా కూడా చర్చల్లో ఉంది. జెర్సీ ఫేం గౌతం తిన్ననూరితో చరణ్ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే కాంబినేషన్ లో సినిమా కన్ ఫర్మ్ అని తెలుస్తుంది.
చరణ్ 16వ సినిమా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో ఉంటుందని టాక్. సినిమాను ఎన్వీ ప్రసాద్, రాం చరణ్ కలిసి నిర్మిస్తారని తెలుస్తుంది. శంకర్ సినిమాతో పాటుగా గౌతం తిన్ననూరి సినిమాను కూడా చరణ్ ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.