
ప్రస్థానం ఫేమ్ దేవా కట్ట డైరక్షన్ లో సాయి ధరం తేజ్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. సినిమాలో సాయి ధరం తేజ్ కలక్టర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా నుండి వచ్చిన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది. ఇక లేటెస్ట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బోర్డర్ లో దేశం కోసం పనిచేస్తున్న సోల్జర్స్ త్యాగాలకు మనం ఇవ్వాల్సిన గుర్తింపు ఇస్తున్నాం దేశంలో ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించిన కలక్టర్స్ గురించి తెలుసుకుందాం.. వారికి థ్యాంక్ యు చెబుదాం అంటూ థ్యాంక్ యు కలక్టర్ ప్రోగ్రాం ఇనిషియేషన్ తీసుకున్నారు రిపబ్లిక్ టీం.
త్వరలో రిలీజ్ కాబోతున్న రిపబ్లిక్ సినిమా ప్రేక్షకుల్లో మరింత బజ్ ఏర్పడేలా రకరకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్థానం తో సత్తా చాటిన దేవా కట్టా రిపబ్లిక్ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.