
ఏ సినిమా అయినా కంటెంట్ ఉంటేనే హిట్ కంటెంట్ లేకుండా స్టార్స్ ఎంత మంచిగా చేసినా సరే అది హిట్ అవదు అంటున్నాడు నాని. నాచురల్ స్టార్ గా స్క్రీన్ నేం పడ్డనాటి నుండి నాని వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ ఇయర్ లో ఇప్పటికే కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మన్ హిట్స్ అందుకున్న నాని రీసెంట్ గా రిలీజ్ అయిన మజ్నుతో కూడా తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.
అయితే వరుస హిట్స్ వస్తున్న ఈ తరుణంలో నాని కేవలం సినిమాలన్ని కంటెంట్ పరంగా కొత్తగా ఉండటం వల్లే హిట్లు అవుతున్నాయని.. లాస్ట్ నాలుగు సినిమాల్లోనే కాదు ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా తాను బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాను కాని అవి కంటెంట్ పరంగా ప్రేక్షకులకు ఎక్కలేదని అంటున్నాడు నాని. ఇక ఇదే ఇయర్ లో మళ్లీ నేను లోకల్ సినిమా కూడా రిలీజ్ చేసి ఒకే సంవత్సరం నాలుగు సినిమాలు అవి కూడా హిట్లు కొట్టి ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాలని చూస్తున్నాడు.