
మాస్ హీరో గోపీచంద్ లీడ్ రోల్ లో సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గోపీచంద్ సీటీమార్ ట్రైలర్ విషయానికి వస్తే కబడ్డీ థీం తో కమర్షియల్ హంగులను అద్ది ఈ సినిమా చేసినట్టు తెలుస్తుంది.
కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేని గోపీచంద్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మాస్ పల్స్ తెలిసిన సంపత్ నంది గోపీచంద్ తో ఆల్రెడీ గౌతం నంద సినిమా చేశాడు. ఆ సినిమా టార్గెట్ మిస్ అవగా సీటీమార్ తో పక్కా హిట్ కొట్టేలా ఉన్నారు. ట్రైలర్ చూస్తే మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా ఫీస్ట్ అందించేలా ఉందని అనిపిస్తుంది. మరి సీటీమార్ తో గోపీచంద్ తన మార్క్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.