రామ్ తో బోయపాటి సినిమా..!

ఇస్మార్ట్ రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమాలో రామ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ మాస్ యాక్షన్ డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్. ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను ఈ సినిమా తర్వాత రామ్ తో మూవీ ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ ఇమేజ్ కు సరిపోయే కథతో బోయపాటి శ్రీను ఇంప్రెస్ చేశాడని టాక్. లింగుసామి సినిమా పూర్తి కాగానే బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని అంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ అదే ఫాం లో రెడ్ సినిమాతో కూడా హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న రామ్ లింగుసామి సినిమా ఆ తర్వాత బోయపాటితో సినిమా ప్లాన్ చేశాడు. చూస్తుంటే రామ్ ఇక మాస్ సినిమాలతోనే ఆడియెన్స్ ను అలరించాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.