
రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న RRR సినిమా ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆ డేట్ న కూడా రావడం కష్టమని తెలుస్తుంది. ఆల్రెడీ క్రిస్ మస్ కి పుష్ప రిలీజ్ ఎనౌన్స్ చేశారు. అందుకే RRR సినిమా సంక్రాంతి రేసులో దిగుతుందని అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో మహేష్, ప్రభాస్, పవన్ సినిమాలు వస్తున్నాయి.
అయితే RRR సినిమా సంక్రాంతికి వస్తుంది కాని ఒక వారం ముందే రిలీజ్ అవుతుందని అంటున్నారు. జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సినిమా షూటింగ్ పూర్తయినా 2022 లోనే RRR రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అసలైతే 2020 జూలై అనుకున్న RRR రిలీజ్.. 2021 జనవరి 8న రిలీజ్ అనుకున్నారు ఆ తర్వాత ఈ ఇయర్ సమ్మర్ కు అనుకున్నా అది కుదరలేదు. ఫైనల్ గా అక్టోబర్ 13న వస్తుందని చెప్పినా ఇప్పుడు ఆ డేట్ న కూడా రావడం కష్టమని తెలుస్తుంది.