సౌత్ లో నెంబర్ 1 అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సౌత్ స్టార్స్ లో తన సత్తా చాటాడు. సౌత్ ఇండియా స్టార్స్ లో అల్లు అర్జున్ మరో రికార్డ్ అందుకున్నాడు. ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ సౌత్ స్టార్స్ లో నెంబర్ 1 గా నిలిచాడు. ఇప్పటివరకు తెలుగు లోనే సినిమాలు చేసిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ తర్వాత సౌత్ లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. రౌడీ హీరోకి ఇన్ స్టాగ్రాం లో 12.9 మిలియన్ ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్నాడు.

ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. మహేష్ కు 7.1 మిలియన్ ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ ఉండగా ప్రభాస్ కు 6.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత రాం చరణ్ 4.1 మిలియన్ ఫాలోవర్స్.. నాగ చైతన్య 3.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.