
ఆరెక్స్ 100 సినిమాతో సక్సెస్ అందుకున్న అజయ్ భూపతి తన సెకండ్ సినిమాగా క్రేజీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీగా మహా సముద్రం వస్తుంది. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను అక్టోబర్ 14న రిలీజ్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటు పలికినట్టు తెలుస్తుంది.
సినిమా నెట్ ఫ్లిక్స్ 10.5 కోట్ల డీల్ సెట్ చేసుకున్నారని తెలుస్తుంది. శర్వానంద్ కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు ఈ రేంజ్ డిజిటల్ రైట్స్ రాలేదని టాక్. ఈ సినిమాతో బొమ్మరిల్లు సిద్ధార్థ్ కూడా తెలుగులో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.