
అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ బాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. కొన్నాళ్లుగా రిలీజ్ విషయంలో క్లారిటీ లేని చిత్రయూనిట్ ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది. అక్టోబర్ 8న అఖిల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే 3 సినిమాలు చేసిన అఖిల్ ఇప్పటివరకు కమర్షియల్ హిట్ అందుకోలేదు. బ్యాచిలర్ తో హిట్ ఖాతా తెరవాలనుకుంటున్న అఖిల్ నిజంగానే అనుకున్న విధంగా సినిమా సక్సెస్ అందుకుంటాడా లేద అన్నది చూడాలి. అక్టోబర్ 8న అఖిల్ వస్తుండగా అక్టోబర్ 14న శర్వానంద్, సిద్ధార్థ్ ల మహాసముద్రం సినిమా వస్తుంది.