
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న సినిమా రామారావు ఈజ్ ఆన్ డ్యూటీ. సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మరో హాట్ హీరోయిన్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. రామారావులో ఐటం సాంగ్ కోసం గోవా బ్యూటీ ఇలియానాని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ గా తెలుగులో సూపర్ ఫాం లో ఉన్నప్పుడు బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ ఇక్కడ కెరియర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్న ఇలియానా చాలా గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది.
ఇక మళ్లీ ఆ తర్వాత అమ్మడికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలో మళ్లీ రామారావు సినిమాలో ఇలియానాకు ఐటం సాంగ్ ఆఫర్ ఇస్తున్నాడు రవితేజ. ఇల్లి బేబ్ కి ఈసారైనా లక్ కలిసి వచ్చి ఈ ఐటం సాంగ్ తో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తుంది. రామారావులో ఇలియానా స్పెషల్ సాంగ్ కన్ ఫర్మ్ అయితే మాత్రం నిజంగానే ఇలియానాకి లక్ తగిలినట్టే.