
నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. అసలైతే కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కు ముందు థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు చక్కపడినా సరే ఏపీలో ఇంకా థియేటర్ల సమస్య తీరకపోవడంతో థియేట్రికల్ రిలీజ్ పై ఆలోచనలో పడ్డారు.
ఇక నిర్మాతల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనలేక నాని టక్ జగదీష్ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అమేజాన్ ప్రైం టక్ జగదీష్ సినిమాను 40 కోట్లకు కొనేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ విషయంపై కూడా గొడవ తెలిసిందే. నాగ చైతన్య లవ్ స్టోరీ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ 10నే నాని టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే వ్యవహారం సర్ధుమనిగిందని అనుకున్నా లేటెస్ట్ గా నాని టక్ జగదీష్ అదే డేట్ ను రిలీజ్ ఫిక్స్ చేయడంతో ఎవరి దారి వాళ్లది అన్నట్టు ఉంది. మొత్తానికి నాగ చైతన్య థియేటర్ లో.. నాని డిజిటల్ స్క్రీన్ మీద.. ఇద్దరు ఒకేరోజు తమ సినిమాలతో వస్తున్నారు.
పండగ కి మన Family తో...
మీ#TuckJagadish pic.twitter.com/sVVjSCsJlB