రకుల్, రవితేజ, పూరీ, ఛార్మీలకు ఈడీ నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. జూలై 2017లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు చెందిన నలుగురు డ్రగ్ డీలర్లను వలపన్ని పట్టుకోగా వారి ద్వారా టాలీవుడ్‌లో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. 

ఆ కేసులో విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తెచ్చినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించడంతో దాని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నేరం కింద వేరేగా కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణ కొరకు దర్శకుడు పూరీ జగన్నాద్‌తో సహా మొత్తం 12 మంది నటీనటులకు ఇతరులకు బుదవారం నోటీసులు పంపించి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

ఈ కేసులో అందరి కంటే ముందుగా దర్శకుడు పూరీ జగన్నాద్‌ను ఈనెల 31న హైదరాబాద్‌ ఈడీ కార్యాలయంలో విచారణకు కావలసిందిగా ఆదేశించింది. ఆ తరువాత వరుసగా సెప్టెంబర్ 2న ఛార్మీ, 6నా రకుల్ ప్రీత్ సింగ్‌, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజ ఆయన డ్రైవర్, 13న నవదీప్, ఫిల్మ్ నగర్‌లోని క్లబ్ జనరల్ మేనేజర్‌, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.