
గుణశేఖర్ డైరక్షన్ లో సమంత ప్రధాన పాత్రలు తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. దిల్ రాజు, గుణశేఖర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవ్ మోహన్, మోహన్ బాబు లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో సమంత తన నటనతో ఆకట్టుకుంటుందని అంటున్నారు.
సోమవారం రాత్రితో కొన్ని యుద్ధ సన్నివేశాలు పూర్తి చేశారట. వాటితో సినిమా మొత్తం పూర్తయిందని తెలుస్తుంది. సినిమా అనుకున్నదానికన్నా బాగా వచ్చిందని చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టిన శాకుంతలం టీం త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేస్తున్న శాకుంతలం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.