ప్రేమం కోసం త్రివిక్రం కూడా..!

మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమం తెలుగులో కూడా అదే టైటిల్ తో వస్తుంది. నాగ చైతన్య, శృతి హాసన్ తో పాటుగా మాత్రుకలో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కూడా తెలుగులో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోతో ఆడియెన్స్ ను అలరిస్తున్న ప్రేమం మూవీ దసరా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాకు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ బలాన్ని చేకూరుస్తుందట.

అందుకే ఆ మాటలను మాటల మాంత్రికుడు త్రివిక్రంతో రాయిస్తున్నారట చిత్రయూనిట్ భావం ఏదైనా త్రివిక్రం పెన్ను పట్టాడంటే అది అందరికి కనెక్ట్ అవుతుంది. తన మాటల పదునుతో మనసు లోతుల్లో వెళ్లగలిగే త్రివిక్రం ఇప్పుడు ప్రేమంకు స్పెషల్ క్రేజ్ తీసుకు రానున్నాడు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే సినిమా చూసేసిన నాగార్జున చైతు ఎకౌంట్ లో ఓ హిట్ పడ్డట్టే అని డిసైడ్ అయ్యాడట.