
యువ హీరో నితిన్ లీడ్ రోల్ లో సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ అందాదున్ రీమేక్ గా వస్తున్న సినిమా మాస్ట్రో. ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. నితిన్ మాస్ట్రో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. నితిన్ అంధుడిగా కనిపించబోతున్న ఈ సినిమా కచ్చితంగా అందరిని థ్రిల్ చేసేలా అతని నటన ఉంటుందని తెలుస్తుంది. నితిన్, తమన్నాల మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
సెప్టెంబర్ 9న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేశారు. చెక్ సినిమా ఫ్లాప్ అవగా రంగ్ దే తో జస్ట్ ఓకే అనిపించుకున్న నితిన్ మాస్ట్రోతో అయినా మెప్పిస్తాడో లేదో చూడాలి. ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉండగా సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే నితిన్ ఖాతాలో ఒక హిట్ పడినట్టే లెక్క. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ లో నిర్మించారు.