
చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి హీరోగా తన టాలెంట్ చూపిస్తున్న విశ్వ కార్తికేయ తన తాజా సినిమా అల్లంత దూరాన అంటూ రాబోతున్నాడు. చలపతి పువ్వుల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విశ్వ కార్తికేయ సరసన ప్రముఖ హీరోయిన్ ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నటిస్తుంది. ఆర్.ఆర్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో శ్రీమతి కోమలి సమర్పిస్తున్న ఈ సినిమాను ఎన్.చంద్రమోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ డైరక్టర్ కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబి చేతుల మీదగా రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన బాబి మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ తో ప్రేక్షకులను సినిమా అలరించేలా ఉందని అన్నారు. దర్శక నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ కు ఈ సినిమా హిట్ ఇవ్వాలని అన్నారు డైరక్టర్ బాబి. సినిమా మోషన్ పోస్టర్ చూసిన ప్రముఖ దర్శక నిర్మాత తమ్మా రెడ్డి భరధ్వాజ కూడా చాలా బాగుందని అన్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వస్తున్న అల్లంత దూరాన సినిమా మోషన్ పోస్టర్ డైరక్టర్ బాబి రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు డైరక్టర్ చలపతి.