
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ తో చేస్తున్న సినిమా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా టైటిల్ గా మొన్నటిదాకా ఎనిమీ, వాస్కోడగామా, చట్టంతో పోరాటం అంటూ ప్రచారం జరుగగా ఇప్పుడు కొత్త అభిమన్యుడు అనే టైటిల్ తెర మీదకు వచ్చింది. దాదాపు ఈ టైటిల్ కన్ఫాం అన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఈ టైటిల్ పై మహేష్ ఫ్యాన్స్ మాత్రం నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమన్యుడు టైటిల్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తూ ప్రచారం మొదలు పెట్టారు. 1980వ దశకంలో శోభన్ బాబు నటించిన అభిమన్యుడు, 2003 లో కళ్యాణ్ రాం కూడా అభిమన్యు టైటిల్ తో వచ్చాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంత ప్రభావితం చూపలేదు అందుకే మహేష్ ఫ్యాన్స్ అభిమన్యుడు టైటిల్ మీద అన్ హ్యాపీగా ఉన్నారు.
అఫిషియల్ టైటిల్ అది కాదంటూ కొంతమంది వాదన.. మొత్తానికి మహేష్ మురుగదాస్ సినిమా టైటిల్ మహేష్ ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజన్ లో పడేసింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.