మీసం తిప్పి.. కాలర్ ఎగురవేసే సినిమా ఇది..!

సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 డైరక్టర్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. లైటింగ్ సూరి బాబు, సోడాల శ్రీదేవి లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ఆగష్టు 27న రిలీజ్ అవుతుంది. రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సుధీర్ బాబు కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా గా వస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఈవెంట్ లో సుధీర్ బాబు స్పీచ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.   

ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ అంటే అనీల్ రావిపుడి మాత్రమే కాదు స్టేజ్ కింద ఉన్న మీరు కూడా చీఫ్ గెస్టులే.. స్టేజ్ మీద ఉన్న వారికి సినిమా అంటే ఎంత పిచ్చో.. స్టేజ్ వైపు చూస్తున్న మీ అందరికి అంతే పిచ్చి.. కాబట్టే ఇక్కడకు మీరంతా వచ్చారు. అడిగిన వెంటనే మందులోడా సాంగ్ రిలీజ్ చేసిన చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పారు సుధీర్ బాబు. చిరు గారు తనకు లక్కీ హ్యాండ్ అని అన్నారు. సమ్మోహనం సినిమా ప్రమోషన్స్ కూడా చిరంజీవి గారే మొదలు పెట్టారు అది మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా ఆయనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారని ఇది కూడా దాన్ని మించి హిట్ అవుతుందని అన్నారు సుధీర్ బాబు.

ఇక శ్రీదేవి సోడా సెంటర్ ను సపోర్ట్ చేసిన డార్లింగ్ ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పారు సుధీర్ బాబు. ఇక మహేష్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మహేష్ కు థ్యాంక్స్ చెప్పి దూరం చేయలేను అన్నారు. సినిమా చూసి వెళ్ళెప్పుడు సూరి బాబు, శ్రీదేవితో వెళ్తారు. ఇది ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే ట్రైలర్ మరొకసారి చూడండని అన్నారు సుధీర్ బాబు. మణిశర్మ గారితో పనిచేయడం చాలా బాగా అనిపించిందని అన్నారు. లిటరేచర్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారు కాబట్టి డైరక్టర్ కరుణ కుమార్ బలమైన కథలు చెబుతుంటారు. పలాస సినిమా చూస్తే అర్ధమవుతుంది. పలాస సినిమా కేవలం ట్రైలర్ మాత్రమే అసలు బొమ్మ శ్రీదేవి సోడా సెంటర్ అని అన్నారు సుధీర్ బాబు. హీరోయిన్ ఆనంది చాలా బాగా చేసింది. సినిమా చూశాక ఆమె మీకు గుర్తుంటుంది అన్నారు.          

ఇక ఫ్రెండ్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిల గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ.. కృష్ణ గారు, మహేష్ పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో వీళ్లిద్దరు ఉంటే అంతే ధైర్యంగా ఉంటుందని అన్నారు. భలే మంచి రోజు ప్రమోషన్స్ టైం లోనే మీరు ఈ పేర్లని మళ్ళీ మళ్ళీ వింటారని చెప్పాను. 3 సినిమాలతో అది ప్రూవ్ చేశారు. వీళ్ల గురించి ఇంకా పెద్దగా వింటారు.. పెద్ద పెద్ద సినిమాలు చేస్తారని అన్నారు సుధీర్ బాబు. ఫ్యూచర్ లో మహేష్ తో కూడా సినిమా చేసే అవకాశం కూడా వస్తుందని అన్నారు. ఆగష్టు 27న సినిమా వస్తుంది. సుధీర్ కు కరెక్ట్ సినిమా పడితే నెక్స్ట్ లెవల్ కు వెళ్తాడని అప్పట్లో మహేష్ అన్నాడు. మహేష్ చెప్పిన ఆ కరెక్ట్ సినిమా ఇదే అని సుధీర్ బాబు అన్నారు. కోవిడ్ కు వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో.. ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నారు. థియేటర్ల దగ్గర ఈ సినిమాతో మళ్లీ జాతర మొదలవ్వాలని అన్నారు. ట్రైలర్ చూసి 98 పర్సెంట్ ఆడియెన్స్ సూపర్ అన్నా.. ఒక 2 పర్సెంట్ ఆడియెన్స్ రొటీన్ కథగా ఉందని అన్నారు. కాని తానెప్పుడు రొటీన్ సినిమాలు చేయనని అన్నారు సుధీర్ బాబు. తాను శపధాలు చేయలచుకోలేదు.. కాని ఆగష్టు 27న సినిమానే మాట్లాడుతుందని అన్నారు. ఫ్యాన్స్ అంతా మీసం తిప్పి.. మీసం లేకపోతే కాలర్ ఎగురవేసేలా సినిమా ఉంటుందని అన్నారు సుధీర్ బాబు.