
15 సంవత్సరాలు సక్సెస్ ఫుల్ కెరియర్ పూర్తి చేసుకున్న రాజమౌళి తన ఈ ప్రస్థానంలో ఓటమి అంటే ఏంటో తెలియకుండా కృషి చేశాడు. ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ షూటిగ్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం గురించి మరోసారి ప్రస్థావించడం జరిగింది. అంతేకాదు మహాభారతం తీస్తే అందులో జూనియర్ ఎన్.టి.ఆర్ మాత్రమే హీరో అని.. తన కోసం కొన్ని డిఫరెంట్ పాత్రలు అనుకున్నా అని తన సన్నిహితులతో షేర్ చేసుకున్నాడట రాజమౌళి.
మరి రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు మహాభారతం తీస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈగతోనే సంచలనాలను సృష్టించిన జక్కన్న బాహుబలి సినిమాతో దేశం మొత్తం గర్వించేలా చేశాడు. ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా స్టామినా ఇది అని చాటి చెప్పిన రాజమౌళి ఇక మహాభారతం తీస్తే అది ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇక తారక్ తోనే తన మొదటి సినిమా పనిచేయడంతో అతనిలోని టాలెంట్ మొత్తం రాజమౌళి గ్రహించగలిగాడు. ఇప్పటికి తనకు ఇష్టమైన హీరో తారక్ అని చెప్పే రాజమౌళి మహాభారతంతో ఎన్.టి.ఆర్ ను ఏ రేంజ్లోకి తీసుకెళ్తాడో చూడాలి.