
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటికే కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతుండటం.. టికెట్ ప్రైజ్ తక్కువగా ఉండటం లాంటి విషయాలు ఇంకా హీరోలు, దర్శక నిర్మాతలని ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణాలో దాదాపు అంతా లైన్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పొచ్చు. అయితే ఏపీలో పరిస్థితి మెరుగుపడే వరకు పెద్ద సినిమాలు వెయిట్ చేయక తప్పదని చెప్పాలి. ఇదిలాఉంటే థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకు ఓటీటీ రిలీజ్ సినిమాలు పోటీ రావడంపై ఎగ్జిబిటర్లు కొందరు ఫైర్ అవుతున్నారు.
సునీల్ నారంగ్ నిర్మించిన నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. అయితే దీనికి పోటీగా నాని టక్ జగదీష్ ఓటీటీలో అదే రోజు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టి మరి టక్ జగదీష్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవాలని చెప్పారు నిర్మాత సునీల్ నారంగ్. లవ్ స్టోరీ వర్సెస్ టక్ జగదీష్ పోటీ కాస్త థియేట్రికల్ వర్సెస్ ఓటీటీ అన్నట్టుగా మారింది. అయితే ఆ నిర్మాతలకు అవసరం ఉండి సినిమాను ఓటీటీ రిలీజ్ చేసినా తమకు సమ్మతమే అని.. కాని ముందు అనుకున్న సినిమా రిలీజ్ డేట్ న ఓటీటీలో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు నిర్మాత సునీల్ నారంగ్. అంతేకాదు ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలు పండుగ టైం ను వదిలిపెట్టాలని అంటున్నారు. మొత్తానికి నాని టక్ జగదీష్ సినిమా రిలీజ్ విషయంపై చర్చ ఓ రేంజ్ లో జరుగుతుందని చెప్పొచ్చు.