బంగార్రాజు మొదలు పెట్టాడు..!

కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రీ క్వల్ గా బంగార్రాజు సినిమా కొన్నాళ్ల్గా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా నాగ చైతన్యకు జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తుంది.

ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. సోగ్గాడే చిన్ని నాయన ప్రీ క్వల్ గా ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తుంది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి చేసి బంగార్రాజు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.