వైష్ణవ్ తేజ్ కొండపొలం ఫస్ట్ లుక్ టీజర్..!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైంది. సినిమాకు కొన్నాళ్లుగా డిస్కషన్ లో ఉన్న కొండపొలం టైటిల్ నే ఫిక్స్ చేశారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది.

ఈ సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రాబోతున్న కొండపొలం సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.