జీ చేతికి KGF 2 రైట్స్..!

కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కె.జి.ఎఫ్ సీక్వల్ మూవీ పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ తో సినిమాపై డబుల్ క్రేజ్ తెచ్చుకోగా సినిమా బిజినెస్ విషయంలో కూడా అదరగొడుతుందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా కె.జి.ఎఫ్ 2 శాటిలైట్ రైట్స్ జీ సంస్థ భారీ రేటుకి కొనేసిందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ వర్షన్స్ అన్ని జీ తెలుగు శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం కె.జి.ఎఫ్ నిర్మాతలకు భారీగానే ముట్టచెప్పినట్టు తెలుస్తుంది.

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వస్తున్న కె.జి.ఎఫ్ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో తెలుగు విలక్షణ నటుడు రావు రమేష్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. డిసెంబర్ 25న క్రిస్ మస్ రేసులో కె.జి.ఎఫ్ 2 వస్తుందని అంటున్నారు. అయితే రిలీజ్ విషయంపై చిత్రయూనిట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయాల్సి ఉంది.  బాలీవుడ్ లో కూడా కె.జి.ఎఫ్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. బీ టౌన్ ఆడియెన్స్ కూడా ఈ సీక్వల్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.