
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఏదో అలా కనిపించిన నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో సోలో హీరోగా సత్తా చాటాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన హిట్ కిక్ తో జాతిరత్నాలు చేశాడు నవీన్. అనుదీప్ కెవి డైరక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా నవీన్ పొలిశెట్టి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందించింది. జాతిరత్నాలు హిట్ తో నవీన్ పొలిశెట్టికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అనుష్క హీరోయిన్ గా నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా వస్తుందని తెలుస్తుంది.
ఇక ఇదే కాకుండా టాలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా నవీన్ పొలిశెట్టి సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. డైరక్టర్ చెప్పిన కథ నచ్చడంతో నవీన్ పొలిశెట్టి సింగిల్ సిట్టింగ్ లోనే సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా జాతిరత్నాలు 2 కూడా నవీన్ పొలిశెట్టి చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.