
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో చిరంజీవితో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
అసలైతే అక్టోబర్ లో రిలీజ్ ఉంటుందని అంటున్నా చిత్రయూనిట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక లేటెస్ట్ గా ఆచార్య సినిమా సంక్రాంతి రేసులో ఉంటుందని టాక్. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట, పవన్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యాం లు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు పొంగల్ రేసులో మెగాస్టార్ ఆచార్య కూడా వస్తుందని టాక్. అయితే సంక్రాంతికి వారం ముందుగానే అంటే జనవరి 6,7 తేదీల్లో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది త్వరలో తెలుస్తుంది.