
మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ గా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మళయాళ వర్షన్ లో మోహన్ లాల్ తో పాటుగా పృధ్విరాజ్ కూడా ఈ సినిమాలో నటించారు. అయితే తెలుగులో ఆ పాత్ర ఎవరు చేస్తారన్నది క్లారిటీ రాలేదు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లాంటి వాళ్ల పేర్లు వినపడ్డా అందులో వాస్తవం లేదని తెలుస్తుంది.
లేటెస్ట్ గా మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో సెకండ్ హీరో పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని టాక్. చిరు సినిమాలో సల్మాన్ ఖాన్ ను తీసుకుని తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అదే నిజమైతే మాత్రం గాడ్ ఫాదర్ సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. బాలీవుడ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన సల్మాన్ ఖాన్ తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తే మాత్రం ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ఇంతకీ చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ ఉంటాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.