ఐకాన్ జోడీ ఎవరు..?

పుష్ప తర్వాత అల్లు అర్జున్ వకీల్ సాబ్ ఫేం వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేస్తాడని తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఐకాన్ సినిమాతో కూడా నేషనల్ వైడ్ సత్తా చాటాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఐకాన్ సినిమాలో విజయ్ దేవరకొండ లైగర్ భామ అనన్యా పాండే నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

అంతేకాదు ఐకాన్ హీరోయిన్ రేసులో జాన్వి కపూర్ కూడా ఉందని టాక్. శ్రీదేవి లానే సౌత్ సినిమాల్లో కూడా నటించాలని అనుకుంటుంది జాన్వి కపూర్. తెలుగులో గ్రాండ్ ఎంట్రీ కోసం అమ్మడు ఎదురుచూస్తుంది. స్టార్ హీరోల సినిమాలతోనే జాన్వి ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఐకాన్ లో అయితే అనన్యా పాండే లేకపోతే జాన్వి కపూర్ ఈ ఇద్దరిలో ఒకరు హీరోయిన్ గా నటిస్తారని తెలుస్తుంది.