ఆ సాంగ్స్ కు ఐకాన్ తమన్నా..!

ఓ పక్క హీరోయిన్ గా మంచి ఫాంలో ఉంటూనే ఐటం సాంగ్స్ లో కూడా స్వింగ్ లో ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా ఆడియెన్స్ తనని అలా చూడాలని ఆశపడుతున్నారు అందుకే నాకు అలాంటి ఆఫర్లే వస్తున్నాయంటూ ఊరిస్తు చెబుతున్న అమ్మడు ఈ ఐటం సాంగ్స్ కోసం బాగానే డిమాండ్ చేస్తుందని టాక్. ఇక తను డబ్బు కోసమే ఐటం సాంగ్స్ చేస్తున్నా అని నిక్కచ్చిగా చెప్పేస్తున్న తమన్నా కన్నడ యువ హీరో నిఖిల్ జాగ్వార్ సినిమాలో ఒక్క ఐటం సాంగ్ కోసం ఏకంగా కోటి రూపాయలు వసూళు చేసిందట.

మరి తమన్నాకి కోటి ఇచ్చారంటే ఆ కోటికి సరిపడా అందాలను గుమ్మరించే ఉంటారు. ఇప్పటికే సౌత్ ప్రేక్షకులను తన హాట్ సోయగాలతో పిచ్చెక్కేలా చేస్తున్న తమన్నా ఇప్పుడు ఐటం సాంగ్స్ తో ఆడియెన్స్ కు నిద్రపట్టకుండా చేస్తుంది. సినిమా సినిమానే ఐటం సాంగ్ ఐటం సాంగే అంటున్న తమన్నా ఈరకంగా క్రేజ్ సంపాదించడం మిగతా భామలుకుళ్లుకునే పరిస్థితి వచ్చింది.

సౌత్ సినిమాల్లో ఐటం సాంగ్ అంటే ముందు తమన్నా దగ్గరకు వచ్చాకే మిగతా హీరోయిన్స్ కు వెళ్లేది. ఇక ప్రస్తుతం ప్రభుదేవాతో అభినేత్రి సినిమాలో నటిస్తున్న అమ్మడు సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. దసరా బరిలో ఓ వైపు తను లీడ్ రోల్ చేసిన అభినేత్రి రిలీజ్ అవుతుండగా మరో వైపు తన ఐటం సాంగ్ తో కేక పెట్టించిన జాగ్వార్ కూడా అదే బరిలో దిగనుంది. మరి అమ్మడి ఐటం సాంగ్ హిట్ అవుతుందో సినిమా సూపర్ అనిపించేలా చేస్తుందో చూడాలి.