
తెలుగు కుర్ర హీరోల్లో ఎనర్జిక్ స్టార్ రామ్ ది ఓ సెపరేట్ స్టైల్.. దేవదాసు నుండి నేను శైలజ దాకా రామ్ సినిమాలన్ని అతనిలోని ఎనర్జీని చూపిస్తాయి. అయితే తనకు తన స్క్రీన్ నేం ఎనర్జిటిక్ స్టార్ అని పడటం ఇష్టం లేదని అంటున్నాడు రామ్. సినిమా పర్ఫెక్ట్ గా వచ్చేందుకు క్యాక్రటరైజేషన్ ను బట్టి తాను ఉంటానని అంతేకాని ఎనర్జిటిక్ స్టార్ గా తాను సూట్ అవనన్నట్టు చెప్పాడు రామ్.
అసలు పేరుకి ముందు స్క్రీన్ నేం అవసరం లేదు అనుకున్నా కాని కందిరీగ టైంలో దర్శక నిర్మాతల బలవంతం మీద అలా పెట్టారని అన్నాడు. ఇక వస్తున్న హైపర్ సినిమాలో మరోసారి తన ఎనర్జీని చూపిస్తున్న రామ్ ఈ సినిమా తర్వాత హైపర్ స్టార్ అవుతాడని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఈ ఇయర్ మొదట్లోనే నేను శైలజ అంటూ ఓ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రామ్ హైపర్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
14 రీల్స్ బ్యానర్లో రాం ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుందర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మరోసారి రామ్ సత్తా చాటేందుకు మరో రెండు రోజుల్లో రాబోతుంది.