
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ శంకర్ డైరక్షన్ లో సినిమాతో వస్తుండగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా భారీ అంచనాలతో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కొరటాల శివ సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఫిక్స్ అన్నట్టు ఉండేది. అయితే ఆచార్యతో మణిశర్మతో కలిసి పనిచేశారు.
తారక్ సినిమాకు అనిరుధ్ తో వర్క్ చేస్తున్నారు కొరటాల శివ. అంతేకాదు ఈ సినిమా కోసం అనిరుధ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. కొరటాల శివ, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఆల్రెడీ జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఈ సినిమాను కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు ఎన్.టి.ఆర్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా లైన్ లో ఉందని తెలిసిందే.